ఇలా చేస్తే.. తొడల మధ్య కొవ్వు దూరం!

24
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తుంటారు. ఇలా నిత్యం కూర్చొని పని చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ముఖ్యంగా కడుపు, తొడల భాగంగా కొవ్వు పేరుకొని పోయి లావుగా కనిపిస్తుంటారు. ఇలా తొడల మద్య కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా తొడల రాపిడి కారణంగా మంట, దురద, వంటి సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. కొంతమంది అసౌకర్యంగా కూడా ఫీల్ అవుతుంటారు. కాబట్టి కడుపు, తొడల మధ్య కొవ్వు కరగడానికి చిన్నపాటి సలహాలు, సూచనలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. ముఖ్యంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామంలో తొడల భాగంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే సైక్లింగ్ చేయడం మరి మంచిది..

ఇంకా ఆఫ్ కొడ్స్, సిటప్స్, కూడా చేస్తే వేగంగా కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ జిమ్ కు వెళుతుంటే ఫిట్ నెస్ నిపుణుల సలహా మేరకు ప్రత్యేక వ్యాయామాలు చేయడం మరి మంచిది. అంతే కాకుండా జీవన శైలిలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తక్కువ దూరం బయటకు వెళ్ళేటప్పుడు కారు, బైకు వంటి వాటిని ఉపయోగించకుండా నడకకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా ప్రతిరోజూ ఉదయం సాయంత్రం సైక్లింగ్, స్విమ్మింగ్ చేయడం కూడా మంచిదే. అపార్ట్మెంట్, ఆఫీసుల్లో పై అంతస్తులకు వెళ్ళేటపుడు లిఫ్ట్ లో కాకుండా మెట్లపై వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రక్త ప్రసరణ పెరిగి కొలెస్ట్రాల్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించడం వల్ల తొడల భాగంలోనూ, ఉదర భాగంలోనూ పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించవచ్చు.

Also Read:TTD:టీటీడీ అందిస్తున్నసేవ‌లు భేష్‌

 

- Advertisement -