మలయాళ రీమేక్‌లో వెంకీ-రానా..!

60
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం మలయాళ చిత్రాల రీమేక్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు మలయాళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం కూడా వచ్చి చేరుతోంది. సినిమా పేరు ‘బ్రోడాడీ’. మోహన్‌లాల్, పృధ్విరాజ్ తండ్రీ కొడుకులుగా రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

అయితే ఈ సినిమా సురేశ్ బాబుకు నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వెంకీ,రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలస్తోంది.

- Advertisement -