తెలుగు సినీ రచయితల ఉగాది వేడుకలు

241
ugadi celebrations of writers
ugadi celebrations of writers
- Advertisement -

హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించింది తెలుగు సినీ రచయితల సంఘం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా.యన్ గోపి పాల్గొన్నారు.పంచాంగ శ్రవణం బ్రహ్మశ్రీ అన్నపర్తి కృష్ణ శర్మ సిద్ధాంతి గారు భాస్కర పంచాంగం ఆవిష్కరించి పంచాంగాన్ని వివరించారు.అంతే కాకుండా తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు డా.పరుచూరి గోపాల కృష్ణ సభాధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం లో నంది అవార్డు గ్రహీతలకు విశిష్ట పురస్కారాన్ని అందచేశారు.పురస్కారం పొందిన వారిలో ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ,డా.ఎస్.వి సత్యనారాయణ (వైస్ ఛాన్సలర్ తెలుగు విశ్వ విద్యాలయం)గుమ్మడి గోపాల కృష్ణ (యెన్.టి.ఆర్ రంగస్థల నటులు) సిరివెన్నెల సీతారామశాస్త్రి అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి ,రాచపాళెం రఘు,పొట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పురస్కారం అందుకున్నారు.

- Advertisement -