- Advertisement -
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. అబుధాబిలో రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు క్షతగాత్రులకు సహాయం చేయడానికి బదులు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ఓ దురలవాటుగా మారింది.
ఇలాంటి అమానవీయమైన చర్యలకు ఎవరైన పాల్పడితే కఠినంగా శిక్షించేందుకు వీలుగా సైబర్‌క్రైమ్ చట్టాన్ని సవరించింది. ఈ నేరానికి పాల్పడితే 6 నెలల జైలు లేదా 31 లక్షల నుంచి కోటి వరకు జరిమానా , ఒక్కోసారి రెండింటినీ విధిస్తారు. సాక్ష్యాల సేకరణలో అధికారులకు మాత్రం మినహాయింపు ఉండనుంది.
- Advertisement -