యూఏఈలో తొలి హిందూ దేవాలయం..

15
- Advertisement -

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

అబుదాబీలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. బీఏపీఎస్ మందిర్ నిర్మాణంలో పింక్ రాజస్థాన్ ఇసుకరాయి, ఇటాలియన్ వైట్ పాలరాతి రాళ్లను ఉపయోగించారు. వీటిని భారత్ లో రూపొందించి, యూఏఈకి రవాణా చేశారు. 2015 లో అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.

ఆ తర్వాత 2019 లో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని కేటాయించింది. దాంతో, మొత్తం 27 ఎకరాల భూ విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలోని ఏడు గోపురాలు ఒక్కొక్కటి ఒక్కో యూఏఈ ఎమిరేట్ కు ప్రతీకలుగా నిలుస్తాయి. సందర్శకుల కేంద్రం, ప్రార్థనా మందిరాలు, థీమాటిక్ గార్డెన్స్, అభ్యాస ప్రాంతాలు ఉండగా భూకంప కార్యకలాపాలు, ఉష్ణోగ్రత మార్పులు మొదలైన వాటిని ట్రాక్ చేయడానికి ఆలయ పునాదిలో 100 సెన్సార్లను అమర్చారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్ల ఖర్చు అయింది.

Also Read:హ్యాపీ వాలెంటైన్స్ డే..

- Advertisement -