నా పట్ల ఇంత కన్సర్న్ ఉన్న సాటి ఛానెళ్లకు ధన్యవాదాలుః టీవీ9 సీఈవో రవిప్రకాశ్

272
tv9 ceo raviprakash
- Advertisement -

తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ప్రముఖ మీడియా సంస్ధ సీఈవో రవిప్రకాశ్. తనను పోలీసులు అరెస్ట్ చేశారని, గత రెండు రోజులుగా రవిప్రకాశ్ అజ్నాతంలో ఉన్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రం టీవీ9 లైవ్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజం చెప్పులు వేసుకునే లోగా అబద్దం ప్రపంచం చుట్టూ తిరిగివస్తుందని తెలిపారు. ఈరోజు నా విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు.

గత 15 సంవత్సరాలుగా టీవీ9 నెంబర్ స్ధానంలో ఉంది. జర్నలిజం విలువల కోసం ఎప్పుడూ నిలబడ్డాం. భవిష్యత్తులోనూ నిలబడతాం. రవి ప్రకాశ్ ఎవరి సంతకాన్నో ఫోర్జరీ చేశారు. రవి ప్రకాశ్ ‘టీవీ9’ నుంచి వేరే ఛానల్ కు నిధులు మళ్లించారు’ అంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలను ప్రసారం చేయడం, స్క్రోలింగ్ లు నడపడం చేస్తున్నారు. నా పట్ల ఇంత కన్సర్న్ ఉన్న సాటి ఛానెళ్లకు ధన్యవాదాలు అన్నారు.

నా సహాచర ఛానల్లు కొద్దిగా బాధ్యతాయుతంగా సరైన వార్తలు వార్తలు రాస్తే బాగుంటుందన్నారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఛానల్‌ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -