- Advertisement -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకైంది. ట్రంప్ అకౌంట్‌ని హ్యాక్ చేసిన నెదర్లాండ్‌కు చెందిన హ్యాకర్ ట్విట్టర్ పోస్టుల్లో మార్పులు చేర్పులు చేశాడు. గత అక్టోబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బిజీగా ఉన్న సమయంలో హ్యాక్ కాగా పాస్‌వర్డ్‌ను కూడా బయటపెట్టాడు హ్యాకర్ విక్టర్ గెవెర్స్.
ఈ విషయాన్ని నెదర్లాండ్ ప్రభుత్వం కూడా దృవీకరించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహించారు ట్రంప్. ఇదే తన ట్విట్టర్ పాస్‌వర్డ్‌గా maga2020ని ఉపయోగించుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ వ్యవస్థ బలహీనమైందని చెప్పడానికే తాను ట్రంప్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు విక్టర్ గెవెర్స్ పేర్కొన్నాడు.
- Advertisement -