బిగ్ బాస్ 4..చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!

42
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 103 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇంకా రెండు రోజుల్లో బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిపోనుండగా హౌస్‌లో ఉన్న సొహైల్,అఖిల్,అరియానా,హారిక,అభిజిత్ ఎవరికి వారే గెలుపై ధీమాగా ఉన్నారు. ఇక ఓటింగ్‌ కూడా పోటాపోటీగా సాగుతోంది.

ఇక ప్రతి సీజన్ ఫైనల్‌కు ఓ చీఫ్ గెస్ట్ సర్‌ప్రైజ్ ఇవ్వనుండగా ఈ సారి ఎవరొస్తారనే దానిపై రకరకాల వార్తలు షికార్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్,ప్రిన్స్ మహేష్ బాబు,చిరంజీవి పేర్లు చక్కర్లు కొట్టగా అసలు చీఫ్ గెస్ట్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చేసింది.

బిగ్ బాస్ 4 విన్నర్‌ని ప్రకటించేంది మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు షో నిర్వాహకులు. మొత్తంగా మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది.