వెనక్కి తగ్గిన ట్రంప్..స్టాక్ పరుగులు!

15
- Advertisement -

ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించగా స్టాక్ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. దీంతో చివరి నిమిషంలో తన మనసు మార్చుకున్న ట్రంప్.. 90 రోజుల పాటు సుంకాల అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి.

గురువారం ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. జపాన్ బెంచ్ మార్క్ నిక్కీ 225 ఇండెక్స్ 8శాతం, దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్ 5శాతం కంటే ఎక్కువ, ఆస్ట్రేలియా ASX 200 కూడా ట్రేడింగ్ ప్రారంభ గంటల్లో 5శాతం పెరిగాయి. చైనా మినహా అన్ని దేశాలకు ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లు పంజుకోవడం విశేషం.

చైనా ఉత్పత్తులపై 104శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్ తాజాగా ప్రతీకార సుంకాలను 125శాతానికి పెంచారు. చైనాసైతం అమెరికా ఉత్పత్తులపై 84శాతానికి సుంకాలను పెంచింది.దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.

Also Read:రాజకీయాల్లోకి రేణు దేశాయ్!

- Advertisement -