ఆడిలైడ్ టెస్టు..భారత్ 244 ఆలౌట్

95
ind vs aus

ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 233 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి మిగితా నాలుగు వికెట్లు కొల్పోయింది. దీంతో 244 పరుగులకు భారత్ ఆలౌటైంది.

అశ్విన్ (15) ప‌రుగుల‌కు ఔట్ కాగా, సాహా(9), ఉమేష్‌(6), ష‌మీ(0) ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవిలియ‌న్ క్యూ క‌ట్టారు. బుమ్రా 4 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో స్టార్క్‌ 4, క‌మిన్స్ 3 వికెట్స్ తీశారు.

ఇక తొలిరోజు రహానే,విరాట్, పుజారా రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో 3 వికెట్లకు 188గా ఉన్న భారత్ …విరాట్ ఔటవడంతో పేకమేడలా కూలిపోయింది.