రేవంత్ రెడ్డి సమైక్యవాది!

15
- Advertisement -

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమైక్యవాదులు.. వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉపముఖ్యమంత్రి అయ్యారు అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్. తెలంగాణ ఇచ్చినప్పుడు.. తెలంగాణ ఇవ్వొద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్నారు.

ఇవాళ అదే సమైక్యవాదులు,, ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారు అన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో 10, 12 శాతం కమిషన్ ఇస్తే కానీ బిల్లులు రావడం లేదు .. ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు అన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను 5 సార్లు కలిస్తే ప్రతిసారి నన్ను నిల్చోబెట్టి మాట్లాడాడు.. నువ్వు బట్టలు ఊడదీసి కొడుతా అంటున్నావు కదా.. నువ్వు ముందు కొట్టాల్సింది నీ మంత్రులనే అన్నారు. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు.. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు అని దుయ్యబట్టారు.

Also Read:OTT Movies: ఈ వారం సినిమాలివే !

- Advertisement -