జెడ్పిటిసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది చారిత్రక, అసాధారణ విజయం అని అన్నారు. టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారు. దేశ చరిత్రలో, స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష తీర్పురాలేదన్నారు.
పార్టీ ఆవిర్భవించిన 2001లోనే టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికలు ఎదుర్కొందని, అప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ పీఠాలు చేజిక్కించుకుని సత్తా చాటిందని వివరించారు. అప్పటినుంచి ఇది ఐదో స్థానిక ఎన్నికల క్రతువు అని, అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఎన్నడూలేనంతగా ఘనవిజయం సాధించిందని చెప్పారు.
నూటికి నూరు శాతం జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని, తమపై ఈస్థాయిలో ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకు రుణపడి ఉంటామని కేటీఆర్ తెలిపారు. ఎన్నిక ఏదైనా సరే, అది బ్యాలెట్ ద్వారా అయినా సరే ఈవీఎం ద్వారా అయినా సరే కేసీఆరే మా నాయకుడు అంటూ మిగతా పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Grateful to the people of Telangana for giving us an incredible 100% victory. 32 out of 32 Zilla Parishads won by TRS nominees and more than 90% Mandal Parishads also set to be won by TRS nominees 😊🙏
Thanks to the millions of party workers who’ve made this happen👍 pic.twitter.com/Yyg3m927IV
— KTR (@KTRTRS) June 4, 2019