జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జోరు..

375
TRS
- Advertisement -

తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించి విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. కారు స్పీడుకు కాంగ్రెస్‌, బీజేపీ అడ్రస్‌లు గల్లంతయ్యాయి.

TRS

ఇక మొత్తం 534 జడ్పీటీసీ, 5,659 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ 3555, కాంగ్రెస్ 1376, బీజేపీ 211, ఇతరులు 592 స్థానాల్లో గెలుపొందారు. జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 428, కాంగ్రెస్ 72, బీజేపీ 7, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ దూసుకెళ్తుండటంతో..రాష్ట్రవ్యాప్తంగా గులాబి శ్రేణులు, సంబురాల్లో మునిగిపోయాయి.

- Advertisement -