టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలో మొక్కలు నాటారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు. అనంతరం అంధ విద్యార్దులతో కలిసి భోజనం చేశారు. నిజామాబాద్ ప్రజల తరపున కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు మంత్రి వేముల. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ భగవంతుడు కేటీఆర్ కు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నానని తెలిపారు.
మరోవైపు కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా శామిర్ పేట్ మండలం తుంకుంటలోని లోని తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ హైస్కూల్ లో మొక్కలను నాటారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి. ఈసందర్భంగా అంతర్జాతీయ రాష్ట్రస్ధాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన స్పోర్ట్స్ విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు జిల్లా చైర్మన్ శరత్ చంద్రారెడ్డి వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు స్పోర్ట్స్ కమిషనర్ దినకర్ బాబు టీజీవో అధ్యక్షురాలు మమత, స్పోర్ట్స్ స్కూల్ ఇన్ చార్జ్ నర్సయ్య మాజీ రాష్ట్ర ఎంపీపిల ఫోరం అధ్యక్షులు చంద్రశేఖర యాదవ్ పాల్గోన్నారు.
ఇక కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సికింద్రాబాద్ లోని పికెట్ లో ఉన్న ఉప కార్-స్వీకార్ బధిరుల ఆశ్రమ పాఠశాలలో వినికిడి లోపంతో బాధపడుతున్న10 మంది విద్యార్థులకు వినికిడి పరికరాలు పంపిణీ చేశారు సికింద్రబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్, యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.