ఈసీతో టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం భేటీ..

155
ec
- Advertisement -

సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధితో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ,ఎమ్మెల్యే లాక్ష్మ రెడ్డి,ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా వారు పలు ఎన్నికల గుర్తులపై పిర్యాదు చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

జడ్చర్ల ఎమ్మెల్యే లాక్ష్మ రెడ్డి మాట్లాడుతూ.. గుర్తును పోలిన గుర్తులు అనేకం ఉన్నాయి వాటిని తొలగించాలని ఎస్ఈసిని కలిశాం. మొన్నటి ఉప ఎన్నికల్లో కారును పోలిన రోటీ మేకర్ గుర్తు వలన మా అభ్యర్థి ఓడిపోయారు. గత ఎంపీ ఎన్నికలలో ఇలాంటి గుర్తులతో బోనగిరి ఎంపీ ఓడిపోయారు. గతంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి పిర్యాదు చేశాం. గుర్తులను పోలిన గుర్తులను తొలగింపు విషయంలో ఎస్ ఈ సి సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రోటీ మేకర్ గుర్తు స్వతంత్ర్య అభ్యర్థికి కేటాయించడం వలన మా టీఆర్‌ఎస్‌ పార్టీకి 3వేల ఓట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఎస్ ఈసి కలిశాం. కారు గుర్తును పోలిన ఇతర ఎన్నికల గుర్తు వల్ల ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘంతో సీఈఓ ,రాష్ట్ర ఎన్నికల సంఘంకు పిర్యాదు చేశామని వినోద్‌ అన్నారు. ప్రతి సారి ఈ గుర్తులు ఓటర్లను గందరగోళం గురి చేస్తున్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా అలాంటి గుర్తులను తొలగించాలని పిర్యాదు చేశాం. జిహెచ్ఎంసి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని మా పార్టీ తరుపున కోరాం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో సారి విశ్వనగరంలో జరిగే ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరపాలి అని చెప్పామని వినోద్‌ కుమార్‌ తెలిపారు

- Advertisement -