ఏపీలో కరోనా తగ్గుముఖం..

119
corona

ఏపీలో గత 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా, 753 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇక, అనేక జిల్లాల్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. అనంతపురం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు మాత్రమే రాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 12 కేసుల చొప్పున వచ్చాయి. ఇవేకాకుండా అనేక జిల్లాల్లో కరోనా కేసులు రెండంకెల సంఖ్యకు పడిపోయాయి.

కాగా రాష్ట్రంలో కరోనాతో 13 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,881కి పెరిగింది. ఇక కరోనా నుండి 1,507 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 8,54,764 పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 17,892 మాత్రమే. 8,29,991 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులైనట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది ఏపీ ఆరోగ్య శాఖ.