వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా..

305
Sania Mirza
- Advertisement -

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు ఇపుడు న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మ‌వుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. 5 ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్ర‌సారం కానుంది. భార‌త్ లో ట్యుబ‌ర్య్కులోసిస్ పై అవ‌గాహ‌న క‌ల్పించేలా ఈ సిరీస్ కొన‌సాగ‌నుంది.

టీబీ నిరంత‌రం పీడిస్తున్న స‌మ‌స్య అని, క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చాలా ప్ర‌భావం చూపించే అవ‌కాశ‌ముంటుంద‌ని సానియామీర్జా అభిప్రాయ‌ప‌డ్డ‌ది. ఎంటీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ షోతో చేప‌ట్టే స‌మిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల‌ మార్పు తీసుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని సానియామీర్జా ఆకాంక్షించింది.

- Advertisement -