TTD:పద్మావతి పరిణయోత్సవం

10
- Advertisement -

తిరుమలలో మే 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవం వార్షికోత్సవం జరగనుంది. నారాయణగిరి గార్డెన్స్‌లోని పరిణయోత్సవ మండపంలో ఏటా శ్రీదేవి భూదేవి, శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది.

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు గజవాహనంపై, రెండో రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామిని పూజిస్తారు.

ఈ మూడు రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే కలియుగం తొలినాళ్లలో శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడిగా భూలోకానికి వచ్చాడు.ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతిని శ్రీ వేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశాడు. ఫాల్గుణి నక్షత్రం ఆవిర్భావంలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు నారాయణవనంలో దివ్య వివాహాన్ని జరిపించాడని శ్రీ వేంకటాచల మహత్యం పేర్కొంది.

పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి వైశాఖ శుద్ధ దశమి తిథికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తుంది.

Also Read:KCR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

- Advertisement -