నిరాశ్రయులకు బాసటగా.. టీఆర్ఎస్ నేతలు

209
hyderabad

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసి పరిదిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో గ్రేటర్ వ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర సరుకులు,శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు.

లింగంపల్లి , నల్లగండ్ల ప్రాంతాల్లో టీఆర్ఎస్ యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు శానిటైజర్లు,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే బోర్డు మెంబర్ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్ధానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో 12 వందల నిరుపేద కుటుంబాలకు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యాన్ని అందించారు ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్.

గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గంలోని యూసఫ్ గూడ, రహమత్ నగర్ ,ఎర్ర గడ్డ,బోరాబండా, శ్రీనగర్ కాలనీ,షేక్ పేట ప్రాంతాల ప్రజలకు బియ్యం పంపిణీ కి పలువురు దాతలు ముందుకువచ్చారు. దాతలు శ్రీనివాస్ రెడ్డి,విజయ్ గాంధీ లింగం,భారత్ లింగం,మరవ్ లింగం,లోకేష్ లింగంలను అభినందించారు ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్.