అల్లు అర్జున్‌కు శ్రియ ఛాలెంజ్‌.. ఏంటో తెలిస్తే షాకే..!

323
Shriya

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినీ సెలబ్రెటీలు షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో ఇంటికే పరిమితమైయ్యారు. వీరు ఈ నేపథ్యంలో రకరకాల ఫొటోలు – వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అలాగే కరోనా పై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికే ప‌రిమిత‌మైన హీరోయిన్ శ్రియ సరికొత్త ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టింది.

ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళ హీరోలు కొంద‌ర‌కి ఓ ఛాలెంజ్ విసిరింది. బార్తన్‌ సాఫ్‌ కరో అంటూ శ్రియ మొద‌లు పెట్టిన ఈ ఛాలెంజ్‌లో భ‌ర్త‌లు ..వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని కోరింది. సోష‌ల్ మీడియాలో వీడియో షేర్ చేసిన శ్రియ‌..నా భ‌ర్త‌నే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా అని ప్ర‌శ్నించింది.

నాకు పాత్ర‌ల‌ని క‌డ‌గ‌డం ఇష్టం ఉండదు. పెళ్ళైన మ‌గ‌వాళ్ళు అంద‌రు వారి వారి భ‌ర్యలకి సాయం చేయాల‌ని కోరుతున్నాను అని ఆర్య‌, అల్లు అర్జున్‌తో పాటు కొంద‌రు ప్ర‌ముఖుల ఐడీల‌ని ట్యాగ్ చేసింది. ఈ అమ్మడు 2018లో బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ అండ్రీ కొచ్చిన్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.