మొక్కలు నాటిన సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు..

21
V Venkateswara Rao

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనాన్ని పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ప్రజలలో అవగాహన పెంచడం జరుగుతుంది అని. ఈ రోజు నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.