యాంకర్‌ అన‌సూయ‌కు కరోనా..!

27
Anchor Anasuya

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ కరోనా వైరస్‌ పేదా, గొప్ప, ఆడా, మగ, చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలో కరోనా పెను విషాదం నింపింది. ఇప్పటికే అమితాబ్, రాజమౌళి, తమన్నా, రామ చరణ్, వరుణ్ తేజ్, రకుల్, దర్శకుడు క్రిష్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా జబర్థస్త్ యాంకర్‌,నటి అన‌సూయ‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.

ఈ రోజు ఉద‌యం ఓ కార్య‌క్ర‌మం కోసం క‌ర్నూలు వెళ‌దామ‌ని ఉద‌యాన్నే లేచాను. నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.దీంతో నా ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వ‌ర‌గా టెస్ట్ చేయించుకుంటాను. ఇటీవ‌లి కాలంలో న‌న్ను క‌లిసిన వాళ్లు కూడా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. నా రిపోర్ట్ ఏంట‌నేది మీకు తెలియ‌జేస్తాను. అంద‌రు జాగ్ర‌త్త అని అన‌సూయ త‌న ట్వీట్‌లో పేర్కొంది.