అతడు దారిలోనే త్రివిక్రమ్?

21
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా అందులో అతడు కి ఓ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమా థియేటర్స్ లో మేజిక్ చేయలేకపోవచ్చు భారీ వసూళ్లు అందుకోలేకపోవచ్చు కానీ టీవీ లో ఈ సినిమాను పదే పదే చూసి ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొత్తని సినిమాల్లో అతడు టాప్ లో ఉంటుంది.

అతడు తో మెప్పించిన మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ తర్వాత ఖలేజా తో బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. మహేష్ తో త్రివిక్రమ్ మళ్ళీ అతడు లాంటి కథే తీస్తున్నాడని అంటున్నారు.

ఓ తాత , ఉమ్మడి కుటుంబం , మనవడు ఇదే కథతో అతడు దారిలోనే ssmb28 ఉండనుందని టాక్ వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ ఇందులో మహేష్ కి తాత గా కనిపించనున్నాడని తెలుస్తుంది. మరి అతడు తో థియేటర్స్ లో మిస్ అయిన ఓ బ్లాక్ బస్టర్ ను మళ్ళీ అదే తరహా కథతో అందుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -