2024 సంక్రాంతి శంకర్ దేనా ?

14
- Advertisement -

వచ్చే ఏడాది సంక్రాంతి ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పేందుకు చూస్తున్నాడు శంకర్. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే కమల్ హాసన్ తో భారతీయుడు 2 తీస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఏక కాలం లో ఫినిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు శంకర్. rc 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇన్ సైడ్ టాక్. అలాగే భారతీయుడు 2 కూడా పొంగల్ కే రానుందని చెన్నై లో గట్టిగా వినిపిస్తుంది.

సంక్రాంతి మనకి ఎంత విశేషమో చెన్నై లో పొంగల్ కూడా అంటే విశేషమే. ఈ రెండు పండుగలు తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు బడా సినిమాలు కావాలసిందే. అందుకే తమిళ్ లో కూడా సంక్రాంతి సీజన్ పై ముందే కన్నేసి బ్లాక్ చేసుకుంటారు. తాజాగా కమల్ హాసన్ భారతీయుడు 2 ను అక్కడ పొంగల్ కే ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు.

ఇదే నిజమైతే సంక్రాంతి కి ఒకే దర్శకుడి నుండి రెండు బడా సినిమాలు రిలీజైన ఓ అరుదైన రికార్డ్ చూడవచ్చు. ఆ రికార్డ్ శంకర్ కి దొరికినట్టే మరి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -