పెళ్లి మాట ఎత్తితే అమ్మడికి మండిపోతోంది

305
- Advertisement -

దక్షిణాదిలో ఒకప్పుడు త్రిషకు ఉన్నతంత క్రేజ్ మరే హీరోయిన్ కు లేదంటే అతిశయోక్తికాదు. సినిమాలు అవకాశాలు తగ్గుతున్న క్రమంలో త్రిష రానాతో ప్రేమాయణం కొనసాగించింది. వారిద్దరు పెళ్లి చేసుకోనున్నారంటూ వదంతులు చిత్రసీమలో హల్‌చల్‌ చేశాయి. అయితే అమ్మడు వాటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ తమిళ నిర్మాత వరుణ్‌ మణియన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వెంటనే వారిద్దరికి వివాహ నిశ్చితార్ధం కూడా జరిగింది.

online news portal

అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని వరుణ్‌ ఫ్యామిలీ ఆంక్షలు విధించడంతో అమ్మడు అక్కడితో బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారించిన త్రిష ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం మళ్లీ పెళ్లి గురించిన త్రిష ఆలోచించడమే లేదు. రెండు బ్రేకప్‌ల తరువాత మళ్లీ త్రిష నోటివెంట ఆ ప్రస్తావనే లేదు. అయితే ఇప్పుడు ఎవరైనా త్రిష వద్ద పెళ్లెప్పుడని అడిగితే చాలు వారిపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతోందట. ఇటీవల ట్విట్టర్‌లో అభిమానులతో త్రిష చాటింగ్‌ చేస్తుండగా ఒక అభిమాని పెళ్లి ఎప్పుడని అడిగాడట. వెంటనే త్రిషకు కోపం తన్నుకొచ్చి. ఆ మాట ఎత్తి తనకు చిరాకు తెప్పించొద్దని హెచ్చరించిందట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. త్రిష బ్రేకప్ లతో ఎంత డిజప్పాయింట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -