టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు సంప్రదాయ భోజనం..

242
ttd

శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈరోజు నుండి గోఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. అంతేకాదు త్వరలో పలుప్రాంతాల్లో భక్తులకు ఈ సాంప్రదాయ భోజనం అందుబాటులోకి రానున్నదని టీటీడీ అధికారులు తెలిపారు.

ఆహార పదార్థాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందజేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం అన్నమయ్య భవన్‌లో గోఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం ఏడుకొండలపైకి వచ్చిన భక్తుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి భక్తులకు విముక్తి లభించనుంది.