తన ఫస్ట్ లవర్‌ ఫోటో షేర్‌ చేసిన వర్మ.. వైరల్‌

47
rgv

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా అది న్యూస్‌ అవుతుంది.. ఇటీవల గత కొద్ది రోజులుగా వర్మ పేరు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. తాజాగా ఆర్జీవి తన ఫస్ట్ లవ్‌ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విద్యార్థి దశలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె పేరు సత్య అని వర్మ తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో తాను ఆమె ప్రేమలో పడ్డానని చెప్పారు. ఆ రోజుల్లో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పక్కపక్కనే ఉండేవని తెలిపారు.

ఆమె మెడికల్ స్టూడెంట్ అని…. ఆమెతో తన వన్ సైడ్ లవ్ మొదలైందని చెప్పారు. అయితే డబ్బున్న వేరే కుర్రాడి కారణంగా తన ప్రేమను ఆమె పట్టించుకోదని తాను భావించానని తెలిపారు. తాను సినీ దర్శకుడిగా మారిన తర్వాత అదే కథతో ‘రంగీలా’ సినిమాను తెరకెక్కించానని చెప్పారు. సత్య మీద ఉన్న ప్రేమతోనే తాను తెరకెక్కించిన ఒక సినిమాకు ‘సత్య’ అని పేరుపెట్టుకున్నానని తెలిపారు. అంతేకాదు ‘క్షణక్షణం’ సినిమాలో శ్రీదేవి పోషించిన పాత్రకు కూడా ‘సత్య’ అనే పేరే పెట్టానని ఆర్జీవీ చెప్పారు. అంతేకాదు ఆమె ఫోటోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.