తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు…

27
rains

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచిఉంది. ఇప్పటికే గులాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ప్రజలు అల్లాడిపోగా తాజాగా మరో తుఫాన్ ఉందన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని… అల్పపీడనం మరింతగా బలపడి..తుపానుగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ తుపానుకు జావద్‌గా నామకరణం చేశారు. 13 లేదా 14న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.