బీఏ రాజు మృతి….టాలీవుడ్ సంతాపం

236
ba-raju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు (62) గుండెపోటుతో మరణించారు. ఆయన హ‌ఠాన్మ‌ర‌ణంతో టాలీవుడ్‌కు షాకింగ్‌గా మారింది. మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో .. బీఏ రాజు గారు చిన్న‌ప్ప‌టి నుండి తెలుసు. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేశాను. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ఒక జెంటిల్‌మెన్. రాజుగారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ తెలపగా దర్శకులు సంపత్‌ నంది, మెహర్‌ రమేష్‌లు, యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, రైటర్‌ గోపీ మోహన్‌, దర్శకనిర్మాత మధురా శ్రీధర్‌ తదితరులు సోషల్‌ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు.

బీఏ రాజు సినిమాల‌కు పీఆర్వోగా ఉండ‌డ‌మే కాక సూప‌ర్ హిట్ అనే సినీ ప‌త్రిక‌ను న‌డుపుతూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవర్స్ సంఖ్య రీసెంట్‌గా 6 ల‌క్ష‌లకు చేరింది.