జయశంకర్ భూపాలపల్లిలో పెద్దపులి కలకలం..

118
tiger
- Advertisement -

ప్రశాంత జీవనం సాగిస్తున్న పల్లెల్లో పెద్దపులి కలకలం రేపుతోంది విచ్చలవిడిగా సంచరిస్తూ అటవీ గ్రామాల ప్రజలకు కంటికి కునుకు లేకుండా చేస్తుంది ప్రతి నిత్యం ప్రాంతంలో ఏదో ఒక చోట తన పంజా విసురుతూ మూగ జీవాలపై దాడికి పాల్ పడుతుంది ఓవైపు పల్లె ప్రజలు లు పెద్దపులి భయంతో బిక్కుబిక్కు గడుపుతున్నారు మరోవైపు సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగృతి పరుస్తూ అవగాహన కల్పించాల్సిన అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార కనీస సూచనలు సలహాలు కూడా చేయడం లేదు దీంతో ఆయా గ్రామాల కు చెందిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.

పెద్దపులి బీభత్సం ఇలాగే కొనసాగితే మనుషులు కూడా దాని బారిన పడే అవకాశాలు ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలో గత రెండు రోజులుగా పెద్దపులి మూగ జీవాలపై దాడులకు పాల్పడుతూనే ఉంది వీరాపూర్ అటవీప్రాంతంలో నేడు అడవిలోకి మేత కోసం వెళ్ళిన పశువుల మంద పై దాడి చేసి రెండు గేదెలను చంపి తినేసింది ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపరి పరిగెత్తుకు వచ్చి గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వెళ్ళిపోయారు.

- Advertisement -