పొలంలో నాటేసి రైతుగా మారిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

452
Gadari Kishore
- Advertisement -

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వరినాట్లు నాటి రైతుగా మారారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని బోయిని లింగయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేశారు ఎమ్మెల్యే. తుంగతుర్తిలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అక్కడ పొలంలో ఆడవాళ్లు వరి నాట్లు నాటుతుండటంతో వారి వద్దకు వెళ్లి పలకరించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్.

అనంతరం వారితో కలిసి పోలంలోకి దిగి నాట్లు వేశారు. కాసేపు అక్కడి కూలీలు, రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆమాయ్ కుమార్ , పీడీ కిరణ్ కుమార్ జెడ్పిచేర్మెన్ గుజ్జ దీపికా-యుగేందర్ రావు గారు,అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

- Advertisement -