టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యత్వ నమోదు గడువు పొడగింపు

403
trsnrimembership
- Advertisement -

టీఆర్ఎస్ ఎన్నారై సభ్యత్వ నమోదు గడువును ఈనెల వరకు పొడిగించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల. సమావేశం సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీపై చర్చించారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నా 40 దేశాల నుండి పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్యమైన స్పందన వస్తుందని మహేశ్ బిగాల తెలిపారు.

విదేశాలలో కూడా వేల సంఖ్యలో మెంబర్ షిప్ లు అవుతున్నందుకు మహేశ్ బిగాలను అభినందించారు. . పలు దేశాల్లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆన్ లైన్ లో సభ్యత్వం తీసుకునేటపుడు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు గడువును పొడిగించాలన్న విజ్ఞప్తిపై కేటీఆర్ ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. ఎన్ఆర్ఐ పాలసీపైన సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -