మానవ జీవితంలో వైద్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మానవజాతి ఉన్నంతకాలం వైద్యులు ఉంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ…2014లో వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.2001కోట్లు కేటాయించామని కానీ ఇప్పడు రూ.12,367కోట్లకు చేరిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సరిపడ 550టన్నుల ఆక్సిజన్‌ను సొంతంగా తయారుచేసుకుంటున్నామని వెల్లడించారు.
వైద్యరంగం బలంగా ఉన్న చోట తక్కువ నష్టంతో బయటపడుతారని చెప్పారని అన్నారు. అందుకే వైద్యరంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పిల్లల పెరుగుదలలో లోపం ఉండకూడదనే న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నట్టు తెలిపారు. న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం వెనుక ఎంతో మేథోమథనం దాగి ఉందని తెలిపారు. ఈ కిట్లతో ఒక తరం ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానాల్లో సామర్థ్యానికి మించి రోగులు వచ్చిన ఓపికతో వైద్యులు వైద్యం చేస్తున్నారని అన్నారు. అందుకే వైద్యరంగంపై విమర్శలే ఎక్కువగా ఉంటాయని ప్రశంసలు తక్కువగా ఉంటాయని తెలిపారు. గతంలో దవాఖానల్లో 30 శాతం డెలివెరీలు జరిగేవని, ఇప్పుడు 70 శాతానికి పెరిగాయన్నారు.
Also Read: అన్నవరంలో పవన్..వారాహికి ప్రత్యేక పూజలు
ఉస్మానియా, గాంధీ, నోలోఫర్ వంటి దవాఖానలే దిక్కని, ఇప్పుడు వరంగల్‌లో ప్రపంచంలో లేని అద్భుతమైన హెల్త్ సిటీని కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో మరో నాలుగు హాస్పిటళ్లు కడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో గాంధీ దవాఖాన అద్భుతమైన సేవలు అందించిందని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు చేతులెత్తేసినా కరోనా రోగులను గాంధీ వైద్యులు కాపాడారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అందరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన