TELANGANA:కళాఖండాలకు అంతార్జాతీయ గౌరవం

45
- Advertisement -

తెలంగాణకు కళాఖండాలకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. గ్రీన్ యాపిల్‌ అవార్డులు తెలంగాణకు సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్ అందిస్తున్న గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. వాటిలో తెలంగాణ సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ, పోలీస్‌ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలకు ఈ అరుదైన గౌరవం లభించింది. భారత్‌కు గ్రీన్ యాపిల్‌ అవార్డులు రావడం ఇదే తొలిసారి.

బ్యూటిఫుల్ వర్క్‌స్పేస్ బిల్డింగ్ కేటగిరిలో తెలంగాణ సచివాలయం, హెరిటేజ్ విభాగంలో మొజంజాహీ మార్కెట్‌, యూనిక్ డిజైన్‌ విభాగంలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, స్పెషల్ ఆఫీస్ విభాగంలో కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌, మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి ఈ అవార్డులు వరించాయి. మే 16న జరిగే ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు.

Also Read: Gold price:లేటెస్ట్ ధరలివే

1994లో ది గ్రీన్ ఆర్గనైజేషన్‌ లండన్‌లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడంతో పాటు ఇందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్నది. ఇది 2016 నుంచి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది.

Also Read: నిద్రలేమి సమస్య…అయితే ముప్పే!

- Advertisement -