నిలోఫర్ ఆసుపత్రి నిర్మాణం వెనుక అసలు కాణరం ఇదే..

23

( నిలోఫర్ అంటే నీలి కలువ పువ్వు అని అర్థం) యువరాణి నిలోఫర్ – హైదరాబాద్ నిజాం యువరాజు “మొజాం ఝా” మొదటి భార్య. (అతడి పేరు మీదనే మొజాం ఝా హీ మార్కెట్ ఉంది). నిలోఫర్ యువరాణి ఈస్తాన్బుల్‌లో పుట్టి పారిస్‌లో పెరిగి ,వివాహానంతరం(1931) ,హైదరాబాద్ చేరుకుంది. ప్రపంచంలో పదిమంది టాప్ అందగత్తెలలో ఆమె ఒకరుగా కీర్తింపబడ్డారు. వివాహానంతరం ఆమెకు సంతానం కలగలేదు. ఈమెకు స్త్రీలపట్ల పిల్లల పట్ల ఆదరణ గౌరవం ఎక్కువగా ఉండేవి. ఈవిడ యొక్క ముఖ్య దాసి ఒకనాడు పురిటిలో బిడ్డని కని చనిపోయింది. దిగ్భ్రాంతికి లోనయిన యువరాణి నిలోఫర్, దాసి మరణానికి కారణమడగగా సరైన వైద్య సౌకర్యాలు లేక ఆ దుర్ఘటన జరిగింది అని తెలిసింది. అందుకే హుటాహుటిన, యువరాణి నిలోఫర్, తమ మామగారయిన -నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌తో మాట్లాడి హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ప్రసూతి ఆసుపత్రి కట్టించి గర్భిణులకు సకల వైద్య ,సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఆసుపత్రి పేరే నిలోఫర్ ఆసుపత్రి.. ఆ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో వెలసిన స్టాల్స్ కి కూడా నిలోఫర్ పేరే పెట్టుకున్నారు.

మొజాం ఝా తో పెళ్లయిన 21 ఏళ్ళు అయినా ఆమెకి పిల్లలు పుట్టలేదు. మొజాం రెండవ భార్యకి మగ పిల్లలు పుట్టారు. దానితో తన భర్తకు విడాకులిచ్చి 70 వేల డాలర్లు భరణం తీసుకొని పారిస్ వెళ్లి తల్లి దగ్గర స్థిరపడింది యువరాణి నిలోఫర్. కొన్నాళ్ళకి పారిస్ లోని వ్యాపారవేత్త, సినీ ప్రొడ్యూసర్ అయిన “ఎడ్వర్డ్ జూలియస్ పోప్ జూనియర్” ని ద్వితీయ వివాహం చేసుకొని (1963) అక్కడే స్థిరపడి 1989లో పారిస్‌లో మరణించింది.