క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శ్రీలంక ఆటగాడు!

209
paranavithana

శ్రీలంక ఆటగాడు తరంగ పరణవితన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు బోర్డుకు పరణవితన తెలిపారని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

2009లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌వేశించాడు. త‌రంగ త‌న రెండు సెంచ‌రీల‌ను 2010లో భార‌త్‌పై న‌మోదు చేశాడు.2012లో త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడాడు. 38 ఏండ్ల ప‌ర‌ణవిత‌న జాతీయ జ‌ట్టు త‌ర‌పుణ 32 టెస్టు మ్యాచ్‌లు అడాడు. రెండు సెంచ‌రీలు, 11 అర్ధ సెంచ‌రీల‌తో మొత్తం 1792 ప‌రుగులు చేశాడు.