సెప్టెంబర్‌ 30లోగా డిగ్రీ పరీక్షలు: సుప్రీం కోర్టు

186
supreme court

డిగ్రీ, యూనివర్సిటీ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్ధానం. సెప్టెంబర్ 30లోగా కాలేజీలు, యూనివర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందేనని తెలిపింది.

యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్‌(యూజీసీ) ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు చెప్పింది. ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా.. విద్యార్థుల‌ను రాష్ట్రాలు ప్ర‌మోట్ చేయ‌లేవ‌ని సుప్రీం వెల్ల‌డించింది.

విద్యార్థు‌లు అయిదు సెమిస్ట‌ర్ల‌ను పూర్తి చేశార‌ని, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావ‌రేజ్‌(సీజీపీఏ) ప‌ద్ధ‌తి ప్ర‌కారం వారి తుది ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని సుప్రీంలో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా వాటిని కొట్టివేసిన సుప్రీం పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది.