తెనాలి రామకృష్ణ సక్సెస్ మీట్

219
sandeep

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “తెనాలి రామకృష్ణ”. ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జీ.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…అందరికి నమస్కారం. మా సినిమాను చూడ్డానికి థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్న అందరికి థాంక్స్. నవ్వించడానికి మేము సినిమా తీశాము ఆడియన్స్ అదే చేస్తున్నారు. సినిమాలో కామెడీ ఉంది, మ్యూజిక్ బాగుంది, ట్విస్ట్ లు బాగున్నాయని అంటున్నారు మాకు అదే చాలు. రెస్పాన్స్ బాగుంది. నా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు, సినిమాకు వచ్చే రెస్పాన్స్ తో మా యూనిట్ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..సినిమాకు మార్నింగ్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్, తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ కు అభినందనలు తెలువుతున్నాను అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..మేము ఈ సినిమా నవ్వించానికి తీసామని ముందు నుండే చెబుతూ వస్తున్నాను. రివ్యూస్ ను స్వాగతిస్తున్నాను. నాకు వచ్చే కాల్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఆడియన్స్ ను నవ్విస్తుందని. బోర్ కొట్టకుండా సినిమా ఉందని అంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారు, ఆ విషయం మమ్మల్ని సంతోష పెట్టింది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రేత్యేక ధన్యవాదాలు, ఆడియన్స్ ఈ సినిమాలో చాలా ఎపిసోడ్స్ లో నవ్వుతున్నారని తెలిపారు.

నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ…సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి థియేటర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.