తెనాలి రామకృష్ణ..టీజర్‌ ఎప్పుడో తెలుసా..!

616
sandeep kishan
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌ ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌’.జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కత్వంలో తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూర్తి కామెడీ నేపథ్యంలో వినోదాన్ని పంచడానికి వస్తుండగా అప్పుడే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

తాజాగా రేపు తెనాలి రామకృష్ణ టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ రేపు ఉదయం 11 గంటలకు టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  సందీప్ కిషన్‌…హన్సికను ముద్దుపెట్టుకుంటున్నట్లు చేసిన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. భూమిక చావ్లా,ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్ త‌దితరులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

- Advertisement -