తెలంగాణలో కారుదే హవాః లగడపాటి

221
Lagadapati

తెలంగాణలో ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీర్ఎస్ పార్టీ దే హవా అన్నారు ఆంధ్ర ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి. కాసేపటి క్రితం వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో లగడపాటి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈప్రెస్ మీట్ లో ఆయన పలు అంశాలు వెల్లడించారు. రేపు వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ గురించి ఆయన చిన్న హింట్ ఇచ్చారు.

తెలంగాణలో కారు జోరు కొనసాగుతుందని..అలాగే ఏపీలో సైకిల్ వైపు ఎక్కువ మంది మెగ్గుచూపుతున్నట్లు తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని..2014లో తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు గుర్తు చేశారు. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. రేపు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లియర్ గా చెబుతానని తెలిపారు.