సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ..ముగ్గురు అరెస్ట్

217
CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధృవపత్రాలు సృష్టించిన ముగ్గురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 44/p సర్వే నంబర్ లో ఉన్న ఓ స్థలం కొనుగోలు కోసం ఏకంగా కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. లెటర్ హెడ్ లను యాకుత్ పురా కు చెందిన టీఆరెస్ లీడర్ నుండి 45 వేలకు కొనుగోలు చేసిన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి తెలిపారు. ఆర్డీవో ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు రాయదుర్గం పోలీసులు.