మీ ఆశీస్సులే సీఎంకు శ్రీరామరక్ష…

32
- Advertisement -

తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉంటే మన సీఎం కేసీఆర్‌నూ ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా రుద్రంగిలో నూతనంగా నిర్మించిన కేజీబీవీని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగాఅనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…ప్రతిపక్షాలు పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. వారి శాపనార్థాలు పెడితే మీరే కాపాడాలి అని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకు పోతుంద‌న్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అవ‌త‌ల ఉన్న క‌ర్ణాట‌క‌లోని రాయిచూర్ ప్ర‌జ‌లు కూడా తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరుతున్నారు. అక్క‌డి ఎమ్మెల్యే.. కర్ణాటక మంత్రి ముందే మమ్మల్ని కూడా తెలంగాణ‌లో కలుపుకోమని అడుగుతున్నార‌ని గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని 14 గ్రామాల స‌ర్పంచ్‌లు, ప్ర‌జ‌లు త‌మ‌ను తెలంగాణ‌లో క‌లుపుకోవాల‌ని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న అనేక ప్రజాప్రయోజన కలిగిన పథకాలే ఇందుకు కారణమన్నారు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో పెన్షన్లు 26 లక్షల మందికి వ‌స్తే.. ఇప్పుడు రూ. 2 వేల పెన్షన్ 46 లక్షలు మందికి వస్తుంద‌ని తెలిపారు. ఇప్పటివరకు రూ. 65 వేల కోట్లు 66 లక్షల మంది రైతుల‌కు రైతుబంధు కింద ఇచ్చాం. ఇప్పుడు ఈ నెల 28 నుంచి రూ. 7600 కోట్లు మళ్లీ రైతుబంధు కింద ఇవ్వ‌బోతున్నామ‌ని తెలిపారు. సంక్రాంతి తర్వాత తాను ఎమ్మెల్యేతో వచ్చి అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటాన‌ని పేర్కొన్నారు. బండ మీది బ‌డికి అవసరమైన మౌలిక వసతులు కూడా కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తున్నాన‌ని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

జవాన్లపై నోరు జాగ్రత్త:ఎస్‌జైశంకర్‌

హైదరాబాద్‌కు పంజాబ్ సీఎం..

పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు… నేను కాదు

- Advertisement -