అనుపమ ఛాన్స్ కొట్టేసిన సమంత

49
- Advertisement -

అనుపమపరమేశ్వరన్‌… మత్తెక్కించే చూపులు.. కైపెక్కించే అందాలు.. గుక్కతిప్పుకోకుండా చూస్తూనే ఉండాలనిపించే ఒంపుసొంపులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ టాలీవుడ్‌ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మోస్ట్ పాపులర్‌ హీరోయిన్‌ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందం.. అభినయంతో తనదైన ముద్ర వేస్తూ.. యంగ్‌ హీరోలకు జోడిగా ఇమిడిపోయే కుదురైన రూపం అనుపమ పరమేశ్వరన్‌ సొంతం. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటీవలే.. నిఖిల్‌ కు జోడిగా కార్తికేయ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి ఈ భామ 18 పేజీస్‌ చిత్రంతో నిఖిల్‌తో ఆడిపాడింది. అయితే ఇప్పుడు.. ఇటు చిత్ర పరిశ్రమలో.. అటు సోషల్‌ మీడియాలో అనుపమ పరమేశ్వరన్‌ పై ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. అదేంటంటే… ఈ అమ్మడికి చేయి దాకా వచ్చిన ఆఫర్‌ మిస్సయిందట… ఓ స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌ గా నటించే అద్భుతమైన అవకాశం అనుపమ చేజారిపోయిందన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. సాధారణంగానే… సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్‌ స్టార్‌ హీరోల పక్కన నటించాలని… మంచి అవకాశాలను దక్కించుకోవాలని అనుకుంటారు.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అరాటపడుతుంటారు.. అటువంటిది అనుపమ పరమేశ్వర్‌ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంది.. అసలేమైంది అనేది చూద్దాం.

అనుపమ పరమేశ్వర్‌, నిఖిల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన 18 పేజీస్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుపమపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనపమ.. మంచి టాలెంట్‌ ఉన్న నటి అంటూనే.. తనకు తెలుగు మట్లాడడం వచ్చు.. ఇది అనుపమకు ఉన్న మరో ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. దాంతో పాటు అనుమప ఫ్యాన్స్‌ కు ఓ చేదు నిజాన్ని కూడా చెప్పారు దర్శకుడు సుకుమార్. అదేంటంటే… తన దర్శకత్వంలో తెరకెక్కిన.. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో.. మొదటగా హీరోయిన్ గా అనుపమను అనుకున్నామని… అనుపమతో ఆడిషన్స్‌ కూడా నిర్వహించామని.. అయితే ఆ సమయంలో అనుపమ విపరీతంగా బయపడిపోయిందని.. ఆమె భయాన్ని చూసి తాను భయపడిపోయి… చివరికి సమంతను రంగస్థలం సినిమాలో హీరోయిన్‌ గా తీసుకున్నామని బాంబ్‌ పేల్చాడు సుకుమార్. రంగస్థలం సినిమా ఏ రేంజ్‌ లో హిట్ అయిందో మనకు తెలిసిందే.. ఆ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఒక వేళ రంగస్థలం సినిమాలో అనుపమ నటించి ఉంటే ఆమె కెరియర్‌ మరోలా ఉండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అటు అనుపమ కూడా తాను రంగస్థలం సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నందుకు బాధగా ఉందని తెగ ఫీల్‌ అవుతోందట. రామ్‌ చరణ్‌ సరసన నటించి ఉంటే అనుపమకు స్టార్‌ హీరోల సరసన నటించే ఆఫర్లు వచ్చేవేనని.. ఓ బంఫర్‌ ఆఫర్‌ ను తమ అభిమాన నటి మిస్‌ చేసుకుందని ఆమె ఫ్యాన్స్‌ ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -