జవాన్లపై నోరు జాగ్రత్త:ఎస్‌జైశంకర్‌

51
- Advertisement -

చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం పార్లమెంట్లో రోజు ఒక కొత్త మలుపు తిరుగుతోంది. తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణను పరిష్కరిస్తున్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

లోక్‌సభలో జైశంకర్‌ మాట్లాడుతూ…. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, అయితే ఆర్మీ జవాన్లను విమర్శించవద్దని ప్రతిపక్ష నేతలను కోరారు. చైనా-భారత్ సంబంధాలు మంచి దశలో లేవని బహిరంగంగా అంగీకరిస్తూనే సరిహద్దులో తీవ్రతరం మరియు విడదీయడం కోసం భారతదేశం చైనాను ఒత్తిడి చేస్తోందని జైశంకర్ అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో జవాన్లను చైనా సైనికులు కొట్టారని రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. చైనా దురాక్రమణను అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

భారత్ జపాన్‌ సమ్మేళనం సందర్భంగా మాట్లాడుతూ చైనా సైనికులు తవాంగ్ సెక్టార్‌లో ప్రస్తుతం ఉన్న మోహరింపును ఇంతకు ముందు చూడలేదని అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి యధాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దానిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టారని అన్నారు. ఇటువంటి దుశ్చర్యలను భారత్ ఎంతమాత్రం సహించదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి…

నాటా సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

సత్ఫలితాన్నిస్తున్న… ‘రైతుబంధు’

రేవంత్ రెడ్డిపై దండయాత్ర.. !

- Advertisement -