సచివాలయం కూల్చివేతకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

101
telangana highcourt

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్ధానం ..ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.దీంతో సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.

కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు కూల్చివేతకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది.

తెలంగాణ ప్రభుత్వ అవసరాల రిత్యా…నూతన సచివాలయాన్ని నిర్మించాలని భావించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని…భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని కోర్టుకు తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్ధానం సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.