తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5 లక్షలు మరియు ప్రమాదంలో గాయాలపాలైన వారికి ఆర్థిక సహాయంగా 10 వేలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 314 ద్వారా రూ.10 కోట్ల 9 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాలలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం కల్గినవారికి రూ.50 వేలు ఇచ్చేవారు దానిని తెలంగాణ ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన రూ.5 లక్షలు ఎక్సగ్రేషయా ఇస్తున్నదన్నారు.
హైదరాబాద్ లోని రవీంద్రభారతి కార్యాలయంలో ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసిన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేషం గౌడ్ మరియు గౌడ సంఘ నాయకులు.ఈ కార్యక్రమంలో గౌడ ఆఫీషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కర్, తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, ఉపాధ్యక్షులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, పవన్ కుమార్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.