అయోధ్య తుది తీర్పు నేడే

603
Ayodya
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఎన్నో ఎళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్ధల వివాదం కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు కోసం దేశ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుప్రింకోర్టు ప్రధాన న్యామయూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30ంటలకు ఈ తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తన అధికారిక వెబ్ సైట్ లో ఒక నోటిసును శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

ఈసంద్భంగా దేశ వ్యాప్తంగా పలు సమస్యక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఒక్క అయోధ్యలో భద్రత కోసమే 4,000 మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు. మరోవైపు శాంతి భద్రతలను కాపాడాలని, తీర్పును గౌరవించాలని రాజకీయ నేతలు, మత పెద్దలు ప్రజలకు విజ్నప్తి చేశారు. అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు.

వేడుకలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉన్నది. ఇది డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సందేశాలను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -