- Advertisement -
శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రాగా లావాదేవీల సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించారు ఐటీ అధికారులు. 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
గతంలోనూ రూ.11 కోట్లు స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ అధికారులు. శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై ఆరా తీస్తోంది ఐటీ.
Also Read:శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి!
- Advertisement -

