ఢిల్లీలో తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ ఏర్పాట్లు..

318
Delhi
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ద‌శ దిశ‌లా చాటేలా తెలంగాణ రాష్ట్ర 5వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఢిల్లీలో ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని అధికారులు స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌తో పాటూ, ఆట‌, పాట‌ను చాటేలా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను రూపొందించారు. మూడు రోజుల పాటు సాగ‌నున్న ఈ వేడుక‌లను ఢిల్లీలోని ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధులు, అధికారులు శుక్ర‌వారం ఘ‌నంగా ప్రారంభించారు.

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యారు. విద్యుత్ దీపాల‌తో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ సుంద‌రంగా ముస్తాబైంది. మే 31 నుంచి, జూన్ 2వ తేది వ‌ర‌కు, మూడు రోజుల పాటూ ఈ ఉత్స‌వాల‌ను జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ క‌ట్టు, బొట్టు, ఆట‌, పాట ల‌తో పాటూ సాంస్కృతిక ఉత్స‌వాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద పీఠ వేసింది. ముఖ్యంగా వీకెండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు రావ‌డంతో తెలంగాణ ప‌ల్లే వాతావ‌ర‌ణాన్ని దేశ రాజ‌ధానిలో క‌నిపించేలా ప్ర‌త్యేక ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా శుక్ర‌వారం తెలంగాణ ఉద్యోగులు, ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొనే వారి కోసం ఏర్పాటు చేసిన వైద్య శిభిరాన్ని ఢిల్లీలోని ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధులు వేణు గోపాల చారి, రామ చంద్రు తెజావ‌త్, మందా జ‌గన్నాథం, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ వేదాంతం గిరి ప్రారంభించారు. అనంత‌రం చార్మినార్ లోని లాడ్ బ‌జార్ ని త‌ల‌పించేలా, తెలంగాణ భ‌వ‌న్ లో లాడ్ బ‌జార్ ను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, హ‌స్త‌క‌ళ‌లు, ఆహార ప‌దార్థాలతో కూడిన‌ ప్ర‌త్యేక స్టాళ్ల‌తో లాడ్ బ‌జారు ఆవిర్భావ వేడుక‌ల‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ నిలిచింది.

ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాల్లో భాగంగా జూన్ 1న భ‌ద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం భ‌ద్రాద్రి వేద‌పండితులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ వేదాంతం గిరి తెలిపారు. అనంత‌రం తెలంగాణకే సొంత‌మైన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. సాయంత్రం తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో భాగంగా నిర్వ‌హించిన ఆట‌ల పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌నాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. జూన్ 2న ఆవిర్భావ వేడ‌క‌ల్లో భాగంగా సింగపూర్, ఆస్ట్రేలియా హైకమిషనర్లకు ఆహ్వానించిన‌ట్లు రెసిడెంట్ క‌మిష‌న‌ర్ తెలిపారు.

- Advertisement -