కాంటైన్‌మెంట్ జోన్‌లను పరిశీలించిన సీఎస్‌..

382
- Advertisement -

తెలంగాణ రాష్ట్రలో కరోనా వైరస్‌ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 101 హాట్‌స్పాట్‌లను గుర్తించారు. హైదరాబాద్‌లో 12 హాట్ స్పాట్స్ గుర్తించి కాంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలకు బయటకు వెళ్లకుండా, ఇతరులు లోపలికి రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నాంపల్లిలోని మల్లపల్లిలో గల బడిమజిద్‌ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు.

CS Somesh Kumar

అక్కడి కరోనా నియంత్రణ చర్యలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిజిపి మహేందర్ రెడ్డి, జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్, హైద్రాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, నగర సిపి అంజనికుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్,వెస్టజోన్ డీసీపీ ఏర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాలో మాట్లాడిన సీఎస్,డీజీపీ.. హైదరాబాద్‌లో 12 కరోనా నియంత్రణ ప్రాంతాలున్నాయని..ఈ ప్రదేశాల్లోకి బయటి వ్యక్తులు రాకూడదని, అలాగే అక్కడి ప్రజలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసమే ఇదంతా చేస్తున్నామని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

- Advertisement -